హుస్నాబాద్, 13 November
కరీంనగర్లోని కిమ్స్ కాలేజ్ ఆఫ్ లాలో నిర్వహించిన ఓరియంటేషన్ డే కార్యక్రమం విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయ విద్యార్థులు తమ విద్యా కాలాన్ని సద్వినియోగం చేసుకొని, న్యాయ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. పుస్తక జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ పరిజ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.పెరియాల రవీందర్రావు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఉత్తమ అవకాశాలను అందించడమే కిమ్స్ విద్యాసంస్థల లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు, ప్రిన్సిపల్ నవీన్ కుమార్, అధ్యాపకులు వెంకటస్వామి, కొమురయ్య, కిషన్, వంశీకృష్ణ, కీర్తి, చారి పాల్గొన్నారు.






