మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ () పరిధిలోని అల్వాల్ సర్కిల్, 133వ మచ్చబొల్లారం డివిజన్ ప్రెసిడెన్సీ కాలనీలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, చిన్నపిల్లల పార్కును మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ప్రారంభించారు. రూ.12.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, చిన్నారుల పార్కుతో పాటు, రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఓపెన్ జిమ్‌తో స్థానికులకు ఆరోగ్య పరిరక్షణకు అవకాశం కలగనుండగా, చిన్నారుల పార్కుతో పిల్లలకు ఆహ్లాదకరమైన ఆటవిడుపు లభించనుంది. సీసీ రోడ్డు నిర్మాణంతో రాకపోకలకు సౌకర్యం కలగనుంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సురేందర్ రెడ్డి, శ్రీశైలం, కాలనీ అధ్యక్షుడు బాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాస్ రెడ్డి, ట్రెజరర్ శ్రీనివాస్, బంగరు రెడ్డి, కులకర్ణి, గంగారాం, మురళీధర్ రెడ్డి, కృష్ణారెడ్డి, యూసుఫ్, అలీ, నరేష్, వీరారెడ్డి, దొరస్వామి రెడ్డి, ఇక్బాల్, సురేష్ రెడ్డి, రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

