యాదాద్రి భువనగిరి జిల్లా మండలం అనాజిపురం గ్రామ సమీపంలోని గౌరెల్లికొత్తగూడెం ప్రధాన రహదారిపై శుక్రవారం తీన్మార్ మల్లన్న పాదయాత్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ, తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారును బలంగా ఢీకొట్టడంతో ఆ కారుతో పాటు ఎదురుగా వస్తున్న మరో కారు కూడా నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. వీరిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటంతో కలకలం రేగింది. గాయపడిన భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసుల సమాచారం. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కారులో కాకుండా కాలినడకన పాదయాత్ర చేస్తున్న తీన్మార్ మల్లన్న తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ప్రమాద తీరు
నుంచి అనాజిపురం మీదుగా తిరుమలగిరి వైపు తీన్మార్ మల్లన్న పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో, చౌటుప్పల్ మండలం జైకేసారానికి చెందిన లారీ (టీఎస్ 30 టీ 7596) వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చి, కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారు (టీఎస్ 30 ఎల్ 444)ను బలంగా ఢీకొట్టింది. లారీ ఢీకొన్న ధాటికి ఫార్చునర్ కారు అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా మండలం అనాజిపురం గ్రామ సమీపంలోని గౌరెల్లికొత్తగూడెం ప్రధాన రహదారిపై శుక్రవారం తీన్మార్ మల్లన్న పాదయాత్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ,
ఈ ప్రమాదంలో టీఎస్ 04 8919 నంబర్ గల కారులో ప్రయాణిస్తున్న తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్, ఆయన భార్య చందన, వారి రెండేళ్ల కుమారుడితో పాటు డ్రైవర్ సురేష్ గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. తీన్మార్ మల్లన్నకు చెందిన ఫార్చునర్ కారులో ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడినట్లు సమాచారం.
మల్లన్న సురక్షితం
లారీ ఢీకొన్న తీవ్రతకు తీన్మార్ మల్లన్న ఫార్చునర్ కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో తీన్మార్ మల్లన్న వాహనంలో లేకుండా, ముందుగా కాలినడకన వెళ్తుండటంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. పాదయాత్రలో పాల్గొంటున్న వారిపై ఒక్కసారిగా ప్రమాదం విరుచుకుపడటంతో అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
కాగా, ఇది కేవలం రోడ్డు ప్రమాదమేనా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రమాదానికి సంబంధించి ఎలాంటి కుట్ర కోణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీరును పరిశీలించి, వాహనాల వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.






