తరిగొప్పుల, 13 November
గ్రామ అభివృద్దే లక్ష్యం సర్పంచ్ సుంకు అంజయ్య
మండలంలోని పోతారం గ్రామంలో వీబీజీ జీ రామ్జీ పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ సుంకు అంజయ్య ప్రారంభించారు. గ్రామంలో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచేందుకే ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు కూడా తగ్గనున్నాయి. ఈ సందర్భంగా సర్పంచ్ సుంకు అంజయ్య మాట్లాడుతూ...గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బెజ్జం భవాని, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుమల్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






