- ప్రారంభించిన సర్పంచ్ ధరావత్ రాజమణి
జనగామ జిల్లా, మండలం, ఇప్పలగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని రత్న తండాలో గ్రామ అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేశారు.
గ్రామ సర్పంచ్ ధరావత్ రాజమణి (రాజు నాయక్) కొబ్బరికాయ కొట్టి, పూజలు నిర్వహించి పనులను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం, రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే మా లక్ష్యం. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పించేందుకు కృషి చేస్తున్నాం. గ్రామ ప్రజల సహకారంతో ఇప్పలగడ్డ గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఇట్టబోయిన శ్రీనివాస్, ధరావత్ వినోద్ కుమార్, శ్రీనివాస్, భానోత్ కుమార్, గ్రామ పెద్దలు ధరావత్ చందు, బండి వెంకన్న, ధరావత్ కాలరాం, ధరావత్ బాలు, ఇట్టబోయిన కనకరాజు, ధరావత్ సక్రు, ధరావత్ ప్రవీణ్, ధరావత్ తుకారం, ధరావత్ రాజు, ధరావత్ అంజి, గ్రామ యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.












