ఇనోవోలు, 2026-11-24
హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం రుద్రాభిషేకం, సాయంత్రం ఊరగుట్టపై ఆఖండజ్యోతి ప్రజ్వలన, దేవాలయంలో జ్వాలాతోరణం, సహస్ర దీపాలంకరణ వంటి కార్యక్రమాలను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు.
హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. సాయంత్రం దేవాలయం నుండి గ్రామంలోని ఊరగుట్టపై ఊరేగింపుగా వెళ్లి ఆఖండజ్యోతిని ప్రజ్వలనం చేశారు. అనంతరం దేవాలయంలో జ్వాలాతోరణం, సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్, దేవాలయ ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ఐనవోలు ఎస్.ఐ అశోక్, వేదపారాయణదారు విక్రాంత్ జోషి, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, మధుకర్ శర్మ, అర్చకులు నందనం భాను ప్రసాద్, నందనం మధు శర్మ, ఉప్పుల శ్రీనివాస్, నరేష్ శర్మ, సాయి వరుణ్, ఇతర అర్చక సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







