బచ్చన్నపేట్, 2026-11-24
కార్తీక పౌర్ణమి సందర్భంగా జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి దేవస్థానంలో అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థాన చరిత్రలోనే తొలిసారిగా జరిగిన ఈ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది. హరహర మహాదేవ నామస్మరణతో సిద్దులగుట్ట మార్మోగింది.
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి దేవస్థానంలో అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధల నడుమ శివసన్నిధిలో అఖండ జ్యోతిని వెలిగించడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. జ్యోతి దర్శనంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
కొడవటూరు సిద్ధేశ్వరస్వామి దేవస్థాన చరిత్రలోనే తొలిసారిగా అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జ్యోతి వెలుగులతో సిద్దులగుట్ట పరిసరాలు దేదీప్యమానంగా మారగా, భక్తుల హరహర మహాదేవ నామస్మరణతో కొండగుట్ట మార్మోగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అఖండ జ్యోతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో చిందం వంశీ, గ్రామ సర్పంచ్ నీల కవిత మురళి, దేవస్థానం చైర్మన్ ఈదులకంటి వెంకట్ రెడ్డి, ప్రధాన పూజారి ఓం నమః శివాయ్య, దేవస్థానం డైరెక్టర్లు, గ్రామ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.




