బచ్చన్నపేట్, 2026-11-22
బచ్చన్నపేట మండలంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను తగిన సహాయం చేసి ఆదుకోవడంలో ముందుంటానని పడమటి కేశపూర్ గ్రామ మాజీ సర్పంచ్ గిద్దెల రమేష్ అన్నారు. గత కొన్ని రోజుల క్రితం మరణించిన తేలు కంటి భరత్ కుటుంబానికి ఆయన పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భరత్ అకాల మృతి ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు. భరత్ తల్లి అరుణ, సోదరుడు సాయి ప్రదీప్, కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ఉన్నారు.







