పుట్టపర్తి, 17 November
హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ కోహెడలోని తన నివాసంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ ఒడితల లక్ష్మీ కాంతారావు (89) వ జన్మదిన వేడుకలను కోహెడ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెరుగు నరేందర్ రెడ్డి, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు.
ఉద్యమ కాలంలో లక్ష్మీ కాంతారావు చేసిన సేవలను, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మండల నాయకులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొక్కుల సురేష్, మాజీ జెడ్పీటీసీ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మండల అధ్యక్షుడు మహేందర్, కోహెడ మాజీ మండల వైస్ ఎంపీపీ తడకల రాజిరెడ్డి, శనిగరం గ్రామ సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య, శనిగరం గ్రామ ఉప సర్పంచ్ పెరిక బుచ్చయ్య, సీనియర్ నాయకులు తోట ఆంజనేయులు, సిద్దిపేట మాజీ ఫారెస్ట్ డైరెక్టర్ అబ్దుల్ రహీం, కోహెడ మండల ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు జాగిరి కుమారస్వామి గౌడ్, సీనియర్ నాయకులు ఇప్పలపల్లి అనంత రాములు, బద్దం తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తిని తిరుపతి గౌడ్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు గాజా తిరుపతి, శనిగరం సిసి పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు అన్న బోయిన బిక్షపతి, సీనియర్ నాయకులు మంద సురేష్ గౌడ్, కోహెడ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ వెంకటస్వామి, సీనియర్ నాయకులు కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సుదర్శన్, సీనియర్ నాయకులు బబ్బురు శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెతుకు లింగారెడ్డి, ఉల్లెంగుల లింగాచారి, తిప్పారపు రాములు పాల్గొన్నారు.







