నెక్కొండ, 16 November
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని మండలంలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
పట్టణ కేంద్రంలోని మహేశ్వర గార్డెన్లో మండలంలోని లబ్ధిదారులకు కలిపి మొత్తం 806 మంది నూతన పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రసంగం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
నియోజకవర్గ పరిధిలో మొత్తం 4900 పెన్షన్లు మంజూరు చేసినట్లు, పరిశీలన దశలో మరో 400 ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







