22 నవంబర్ 26 ఓరుగల్లు న్యూస్ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 22
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక, భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో నీటి ప్రాధాన్యత, పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మాస్టర్‌మైండ్స్ పాఠశాల విద్యార్థులు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు, నాటికల రూపంలో నీటి కొరత వల్ల ఎదురయ్యే సమస్యలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే తాగునీరు, సాగునీటికి ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ, నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని సందేశాన్ని అందించారు. విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ హరిబాబు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి ప్రతి చుక్క ఎంతో విలువైనదని, నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో పొదుపు అలవాట్లు పెంపొందించాలని, నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







