సిద్దిపేట నియోజకవర్గ యువతీ యువకుల కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో ఉచిత కానిస్టేబుల్ శిక్షణా శిబిరం ప్రారంభం కానుంది. ఈ శిబిరం 60 రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు గందే నరేష్ తెలిపారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో కెసిఆర్ ఉచిత శిక్షణ శిబిరం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల దరఖాస్తులు స్వీకరించి అర్హత పరీక్ష నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి శిక్షణ
అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 27వ తేదీ నుండి ఉచిత కానిస్టేబుల్ శిక్షణా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించనున్నారు.
ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు సిద్దిపేట బైపాస్ లోని జిల్లా గ్రంథాలయం ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ భవన్లో శిక్షణా శిబిరం ప్రారంభమవుతుంది. ఇటీవల అర్హత సాధించిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.











