ప్రముఖ విద్యావేత్త, తాళ్ల పద్మావతి విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ తాళ్ల మల్లేశం మృతి పట్ల జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
గురువారం వరంగల్లోని తాళ్ల మల్లేశం నివాసానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లి, మల్లేశం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యారంగంలో తాళ్ల మల్లేశం అందించిన సేవలు, విద్యాసంస్థల స్థాపన ద్వారా విద్యాభివృద్ధికి చేసిన కృషి మరువలేనివని అన్నారు. ఆయన మృతి విద్యారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. మల్లేశం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.












