చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం అధికారికంగా జరిగింది. చైర్మన్ గా కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ గా బోయినీ శ్రీనివాస్, సభ్యులు ప్రమాణ స్వీకారాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించగా, జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులంతా హాజరయ్యారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు తమ పనులను దర్జాగా కానిచ్చేశారు.
దొంగల చేతిలో నాయకులు, కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి రెండు తులాల బంగారు గొలుసుతో పాటు, ఓ డైరెక్టర్ జేబులోంచి సుమారు రూ.12 వేలు మాయం చేశారు. దీంతో పాటు పలు గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తల జేబుల్లోంచి దొంగలు లూటీ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు రూ.5 లక్షల వరకు దొంగతనం జరిగినట్లు తెలిసింది.
పోలీసులకు ఫిర్యాదు
దీంతో కార్యకర్తలు, నాయకులు దిక్కుతోచని స్థితిలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిమ్మకుండిపోయారు. ఈ విషయమై పలువురు కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.












