రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆత్మ కమిటీ చైర్మన్ బట్టు మహేందర్ రెడ్డి ఆకాంక్ష
చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, డైరెక్టర్ పింగిళి ఇంద్రారెడ్డిల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా, వారిని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు వగలబోయిన యాదగిరిగౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
రైతులకు మెరుగైన సేవలు అందించాలి
జనగామ క్లస్టర్ ఆత్మ కమిటీ చైర్మన్ బట్టు మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతన చైర్మన్, డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శులు బృంగి శివకుమార్, గోరంతల వీరన్న, దామెర లూకా, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అర్జుల పోసిరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎరవెల్లి పోచయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు మంద చంద్రయ్య, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ యాకూబ్, అధికార ప్రతినిధి నరహరి, గ్రామ శాఖ అధ్యక్షులు పండుగ కనకయ్య, నరసింహులు గౌడ్, రాజశేఖర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












