నర్మెట్ట, గురువారం
నిరసనలో కాంగ్రెస్అధినేతరాహుల్గాంధీఅరెస్టుకునునిరసిస్తూనర్మెట్టమండలకేంద్రంలోకాంగ్రెస్నాయకులుగురువారంధర్నానిర్వహించారు.మండలఅధ్యక్షుడురావులబిక్షపతిఆధ్వర్యంలోజరిగినఈనిరసనకార్యక్రమంలోముఖ్యఅతిధులుగాకొమురవెల్లిదేవస్థానంచైర్మన్గంగంనర్సింహారెడ్డి,సర్పంచ్లఫోరమ్జిల్లాఅధ్యక్షులుగోపగోనిశ్రీధర్పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నర్మెట్ట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రావుల బిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ గంగం నర్సింహా రెడ్డి, సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు గోపగోని శ్రీధర్ ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు.
దేశ యువత ప్రశ్నిస్తోందని, విద్యార్థి లోకం దూసుకొస్తోందని మోదీ ప్రభుత్వానికి వెన్నులో వణుకు మొదలైందని వారు అన్నారు. ఉద్యోగాలపై సమాధానం లేదని, పరీక్షల నిర్వహణపై జవాబు లేదని, ధరల పెరుగుదలపై చిత్తశుద్ధి లేదని, రైతుల సంక్షోభంపై చలనం లేదని విమర్శించారు. ప్రజలకు జవాబులు చెప్పాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించిన వారిపై పోలీసులను ఉసిగొల్పుతోందని ఆరోపించారు.
అందుకే ప్రజల తరఫున నిలిచిన రాహుల్ గాంధీని, ఎన్నికైన మహిళా ఎంపీ ప్రియాంక గాంధీని మహిళా పోలీసులు లేకుండా అవమానకరంగా వ్యవహరించారని ధర్నాలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం, నిరసనలను అణచివేయడానికే పోలీసు బలాన్ని ఉపయోగిస్తోందని, ఇది మోదీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని విమర్శించారు.
ప్రశ్నించే గొంతులను అరెస్టు చేయవచ్చని, కానీ ప్రజల ఆగ్రహాన్ని ఆపలేరని, యువత తిరుగుబాటును లాఠీలతో ఆపలేరని, ప్రజాస్వామ్యాన్ని సంకెళ్లతో బంధించలేరని వారు స్పష్టం చేశారు. ఈ అహంకార, నిరంకుశ పాలనకు ప్రజలే ప్రజాస్వామ్య పాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాజ మాజీ మండల అధ్యక్షులు రాజబోయిన లక్ష్మి నారాయణ, ఇప్పల గడ్డ సర్పంచ్ ధరవత్ రాజమణి రెడ్యానాయక్, ఉషిక బాయి తండా సర్పంచ్ బాలాజీనాయక్, అమ్మాపురం సర్పంచ్ బోలగాని రేఖా బాపురాజు గౌడ్, కీషన్ సేల్ మండల అధ్యక్షులు చేవుల పరశురాములు, మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి బాలచందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుర్ర నరేష్ గౌడ్, బైరగోని అంజయ్య గౌడ్, మండల కోశాధికారి వడపల్లి రాజు, జిల్లా కార్యదర్శి వలబోజు శ్రీనివాస్, మండల సలహాదరులు వంగా భూపాల్ రెడ్డి, ఎస్టీ సేల్ జిల్లా ఉపాధ్యక్షులు భానోత్ బాలుసింగ్ నాయక్, జిల్లా సీనియర్ నాయకులు ధరవత్ రాజు నాయక్, మండల నాయకులు కొంపెల్లి అంబేద్కర్, ఉపాసర్పంచులు ఇనుగాల రాజిరెడ్డి, జినుక బాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రజ్ఞాపూరం శ్రీధర్, జడల రమేష్ గౌడ్, లాల్, కల్వ అశోక్, వెల్దండా పండ్ల బలనర్సూ, బైరగోని సురేందర్, నర్సిములు, సత్యనారాయణ, అజ్మీరా దేవసింగ్, అంగోత్ రవి, మలోత్ కిషన్, నర్మెట యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భుక్య పవన్ నాయక్, తుంగ యాదగిరి, సురేష్, రాయరపు రాజు, కోంరే వెంకన్న, గుగులోత్ క్రిష్ణ, మహేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.










