మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా మండలంలోని బొమ్మకూరు గ్రామానికి చెందిన రావుల బిక్షపతిని నియమించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ నియామకం చేపట్టింది.
ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచిన పార్టీ అధిష్టానానికి, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మినారాయణ నాయక్, అలాగే తనకు పదవి రావడానికి సహకరించిన జిల్లా నాయకులు, మండల నాయకులు, ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరికీ నూతన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేస్తానని అన్నారు.











