జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను మండలంలోని వెల్దండ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం మండలం అధ్యక్షుడు కంతి ఆంజనేయులు ఆధ్వర్యంలో కేక్ కోసి పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులు మాట్లాడుతూ.. జనగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పల్లా ఒక ఆరోగ్య ప్రదాత అని అన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు శివంగుల సిద్దిమల్లయ్య, కంతి మల్లయ్య, పులిగిల్ల సిద్ధయ్య, పిట్టల కృష్ణమూర్తి, బుస్సీ కర్ణాకర్ రెడ్డి, బైరగోని శ్రీనివాస్, మంకెన తిరుపతి రెడ్డి, కుంచం మల్లేశం, పిట్టల నరేష్, పంతెంగి యాకన్న, గోల్కొండ నరసింగరావు, కోలేపాక పవన్, చేర్యాల ఆంజనేయులు, నీల నరేష్, గూడ శ్రీనివాసరెడ్డి, మహిళలు పాల్గొన్నారు.










