జనగామ, 10 July
సఅదథ,సేదదగహఅణీహేజగఎేజేేీగహేజగజేదూణీేసహగఎే
ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక, మానసిక వేదనతో రిటైర్డ్ ఉద్యోగి మల్లయ్య ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరం. విశ్రాంత ఉపాధ్యాయుడి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లయ్య చిత్రపటానికి పూలు చల్లి నివాళులు అర్పించారు. అనంతరం మృతుడి భార్య అనిత, కుమారుడు భార్గవ్‌ను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా దాదాపు 35 సంవత్సరాలు సేవలందించిన మల్లయ్యకు ఉద్యోగ విరమణ అనంతరం రావాల్సిన పీఎఫ్, జీపీఎఫ్, గ్రాట్యుటీతో పాటు ఇతర రిటైర్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించ కపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. బకాయిల కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా, కోర్టును ఆశ్రయించినా న్యాయం జరగలేదని అన్నారు.
కూతురు వివాహం కోసం చేసిన అప్పులు, వాటిపై పెరిగిన వడ్డీలు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురైన మల్లయ్య, తనలాంటి విశ్రాంత ఉద్యోగులు ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడవద్దని లేఖ లో పేర్కొంటూ చివరకు బలవన్మరణానికి పాల్పడటం అత్యంత విషాదకరమని అన్నారు. జీవితాంతం ఇతరులకు సేవ చేసిన వ్యక్తి చివరికి ప్రభుత్వ నిర్లక్ష్యా నికి బలికావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
డబ్బులు లేక ఆసుపత్రుల్లో చేరలేక మరణించిన విశ్రాంత ఉద్యో గులు ఉన్నారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన తర్వాత బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. ప్రభుత్వం అప్పుల గురించి మాట్లాడటం మానేసి, కాంట్రాక్టర్లకు చెల్లించే నిధులను ఒక్కరోజు నిలిపివేసినా విశ్రాంత ఉద్యోగుల రిటైర్మెం ట్ బెనిఫిట్స్ అన్నీ చెల్లించవచ్చని సూచించారు.
రిటైర్మెంట్ బకాయిల కోసం కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిర గాల్సిన పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న అన్ని రిటైర్మెంట్ బకా యిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించ డంతో పాటు కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. అలా గే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












