హుస్నాబాద్, 19 November
తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని సముద్రాలలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు జనరల్ బాడీ సమావేశం జరిగింది. హుస్నాబాద్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో డివిజన్ సమస్యలపై చర్చించారు. త్వరలో కొన్ని నూతన కార్యాచరణలు చేపట్టాలని నిర్ణయించారు. విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణ దిశగా వెళుతుంటే, తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఇతర సంఘాలతో కలిసి పోరాడుతుందని ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు మరియు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి తెలిపారు. ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ట్రాన్స్‌కో కంపెనీ అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటన్ మధు మాట్లాడుతూ, హర్యానా రాష్ట్రంలో ఐక్య సంఘాలుగా ఏర్పడి విద్యుత్ సంస్థను ప్రైవేటీకరణ నుండి రక్షించి, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి దిగొచ్చేలా పోరాటం చేసిన విధానాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో కూడా ఇలాగే ఐక్య సంఘాల పోరాటాలు చేస్తే, సంస్థ రక్షణతో పాటు ఉద్యోగ, కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఆర్టిజన్ కార్మికులకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మరియు అన్మాండ్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటుపల్లి సధాకర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ జిల్లా జాయింట్ సెక్రెటరీ హరీష్, డివిజన్ నాయకులు వినయ్ రెడ్డి, చందు గౌడ్, రాములు, రాము, రాజు, నాగేష్, భాస్కర్, కనకయ్య, వహీద్, గణేష్, రేణుక తదితరులు పాల్గొన్నారు. జనరల్ బాడీ సమావేశం అనంతరం, కొత్తగా కో-ఆప్షన్ సభ్యులను డివిజన్ కమిటీలోకి తీసుకోవడం జరిగింది. డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా . రమేశ్‌ను, డివిజన్ ఉపాధ్యక్షులుగా నాగరాజును, జాయింట్ సెక్రెటరీగా సతీష్‌ను ఎన్నుకున్నారు.



