Jangaon/Tharigoppula (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 22
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకుల అభినందనలు
తరిగొప్పుల మత్స్య సహకార సొసైటీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన సుంకరి కనకరాజును జనగామకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కనకరాజును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగరావు,జిల్లా నాయకులు పెద్ది రాజిరెడ్డి, జనగామ మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు, కౌన్సిలర్లు గోపగోని సుగుణాకర్ గౌడ్, మధుసూదన్,పానుగంటి సువార్త,జనగామ టౌన్ అధ్యక్షుడు తాళ్ల సురేష్ రెడ్డి, ఇంగదుల కృష్ణ, వడ్లకొండ మాజీ సర్పంచ్ శారద, మండల యువ నాయకుడు చిలువేరు సతీష్ తదితరులు పాల్గొన్నారు.







