22 నవంబర్ 26 ఓరుగల్లు న్యూస్ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 22
సిద్దిపేట మెడికల్ కాలేజీకి మాజీ ఎమ్మెల్యే అనంతుల మదన్ మోహన్ పేరు పెట్టడాన్ని చిన్నకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ స్వాగతించారు. మదన్ మోహన్ సిద్దిపేట అభివృద్ధికి చేసిన కృషికి తగిన గౌరవం లభించిందని ఆయన అన్నారు.
సిద్దిపేట మెడికల్ కాలేజీకి మాజీ ఎమ్మెల్యే అనంతుల మదన్ మోహన్ పేరు పెట్టడం గర్వించదగ్గ విషయమని చిన్నకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో సిద్దిపేట అభివృద్ధికి మదన్ మోహన్ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు తగిన గౌరవం దక్కిందని అన్నారు.
ఇటీవల జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు పెట్టాలని ఆదేశించారని, వెనువెంటనే కాలేజీకి అనంతుల మదన్ మోహన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సిద్దిపేట ప్రాంత అభివృద్ధికి శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజా సంక్షేమానికి మారుపేరని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలనను బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.







