కుకునూరుపల్లి (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 25
వెంకటాపూర్ గ్రామంలో లబ్ధిదారు పేర్క స్వరూప సత్యనారాయణకు మంజూరైన ఇందిరమ్మ ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు కందూరి ఐలయ్య ఆధ్వర్యంలో ముగ్గు పోశారు.
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో బుధవారం పేర్క స్వరూప సత్యనారాయణకు మంజూరైన ఇందిరమ్మ ఇంటికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కందూరి ఐలయ్య ఆధ్వర్యంలో ముగ్గు పోశారు. ఈ సందర్భంగా కందూరి ఐలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఉండకూడదనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంక్షారెడ్డి సహకారంతో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తూ, ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు.
అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యాలు, ప్రభుత్వం అందిస్తున్న సహాయం, పేదలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కరుణాకర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.







