మద్దూరు, 2026-11-26
సిద్దిపేట జిల్లా మర్మాముల గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ గుడి స్టోర్ రూమ్ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ గుడిలో స్టోర్ రూమ్ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ కొబ్బరికాయ కొట్టి, ముగ్గు పోసి ప్రారంభించారు. స్టోర్ రూమ్ నిర్మాణానికి దాతగా నిలిచిన శ్రీ ఊట్ల శ్రీనికేతన్ రెడ్డికి సర్పంచ్ గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మండల మాజీ వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలత, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆలేటి విష్ణు, ఆలయ పూజారి సుందరగిరి సిద్దయ్య పాల్గొన్నారు.







