సంజయ్‌నగర్ నూతన మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి - వ్యాపారులు, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు జనగామ పట్టణ ప్రజలతోపాటు వ్యాపారులు సంజయ్ నగర్ లో ఏర్పాటుచేసిన నూతన మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ అన్నారు. శనివారం జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ చిమ్ముల రాజశేఖర్ రెడ్డి సంజయ్‌నగర్ నూతన మార్కెట్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. వ్యాపారులు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. మార్కెట్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, లైటింగ్, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలపై అధికారులు పరిశీలన జరిపారు. మార్కెట్‌ను నిత్యం పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. నూతన మార్కెట్లో కూరగాయలు, పండ్లు, పూలు, వెజ్, నాన్‌వెజ్ తదితర వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నట్లు చైర్పర్సన్, కమిషనర్ తెలిపారు. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వ్యాపారులకు అవగాహన కల్పిస్తూ, వారిని నూతన మార్కెట్‌కు తరలించేలా మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు కూడా నూతన మార్కెట్‌కు వచ్చి కూరగాయలు, పండ్లు, పూలు, ఇతర నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయాలని అధికారులు కోరారు. మార్కెట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే ఒకే ప్రాంతంలో వివిధ రకాల వస్తువులు అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులకు మరింత సౌకర్యం కలుగుతుందని తెలిపారు. వ్యాపారులు, ప్రజలు సహకరించి నూతన మార్కెట్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సంజయ్ నగర్ నూతన మార్కెట్ ను సద్వినియోగం చేసుకోవాలి
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- వ్యాపారులు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
- మార్కెట్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, లైటింగ్, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలపై అధికారులు పరిశీలన జరిపారు.
- మార్కెట్‌ను నిత్యం పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.
- నూతన మార్కెట్లో కూరగాయలు, పండ్లు, పూలు, వెజ్, నాన్‌వెజ్ తదితర వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నట్లు చైర్పర్సన్, కమిషనర్ తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
277ఆర్టికల్స్
79,011వ్యూస్