నర్మేటా, 16 November
కార్యకర్తలకు నామినేట్ పదవుల హామీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
జనగామ నియోజకవర్గం మండల సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఓబీసీ సేల్ కార్యదర్శి పరిధుల యాదయ్య గౌడ్ ను హైదరాబాద్ లోని తన నివాసానికి పిలిపించుకుని, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, నాయకుల గురించి, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజల నుంచి వస్తున్న స్పందన వంటి విషయాలను మాజీ ఎమ్మెల్యే, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, కష్టపడిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, త్వరలోనే నామినేట్ పదవులను కూడా అందజేస్తామని మనస్ఫూర్తిగా హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులను సంఘటితంగా ఉంచుకోవాలని, ప్రజలకు మరింత చేరువగా వెళ్లాలని సూచించారు.







