Jangaon/Tharigoppula (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 15
నూతన వధూవరులను ఆశీర్వదించిన జనగామ ఎమ్మెల్యే పల్లా
జనగామ పట్టణంలోని శ్రీ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో దేవరకొండ వెంకట్ కుమార్తె తేజస్వీ వివాహ వేడుక నవంబరు 15వ తేదీన ఘనంగా జరిగింది. ఈ వేడుకకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నూతన జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం పట్ల దేవరకొండ వెంకట్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.






