తెలంగాణ, 13 November
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సజ్జనార్ పై మాజీ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు సంచలన ట్వీట్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సజ్జనార్ ను యూనిఫాంలో ఉన్న నేరస్థుడిగా అభివర్ణించడం తీవ్ర చర్చనీయాంశమైంది. తనను నేరస్థుడిగా విమర్శించడం బాధ కలిగిస్తోందని నాగేశ్వరరావు తన ట్వీట్లో పేర్కొన్నారు. సర్వీస్ స్నేహబంధం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని, కేవలం బదిలీ చేయడం శిక్ష కాదని, గతంలో జరిగిన నేరాలు చెరిగిపోవని ఆయన అన్నారు. ఐపీఎస్ అధికారి సజ్జనార్ పై వచ్చిన ఆరోపణలన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ ట్వీట్ పోలీసు శాఖలో మరియు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.






