రెడ్డిగూడెం, 11 November
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ సిద్దిపేట జిల్లా పర్యటన విజయవంతం అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి అధికారులను ఆదేశించారు. ఈనెల 19వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా పథకం, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలను సీఎం ప్రారంభిస్తారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ జిల్లా పర్యటన విజయవంతం అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, ఈనెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలో పర్యటించి, ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా పథకాన్ని, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె అన్నారు.
సభ నిర్వహణ కోసం గతంలో ముఖ్యమంత్రి సభ జరిగిన నాగ దేవత గుడి సమీపంలోని ప్రాంతాన్ని ఈరోజు రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ పరిశీలించారని తెలిపారు. సభా ప్రాంగణాన్ని భారీ సంఖ్యలో హాజరయ్యే ప్రజలకు, విఐపిలకు, అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీర్చిదిద్దాలని, వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్, వేదిక (డయాస్), త్రాగునీరు, విద్యుత్ సరఫరా, సౌండ్ సిస్టం, సౌకర్యవంతంగా కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని సూచించారు. రేపు బుధవారం ఉదయం నుండి సభా ప్రాంగణం శుభ్రపరచడం (క్లీనింగ్), చదును చేయడం (లెవలింగ్) పనులు చేపట్టాలని, వేదిక (డయాస్) ఏర్పాటు, సభా ప్రాంగణం తీర్చిదిద్దడం, విద్యుత్ తదితర ఏర్పాట్ల కోసం రేపు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు వివిధ శాఖలకు సంబంధించిన వివరాలను అందజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయబడినది.






