మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్
జనగామ మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్తను వేరుచేసే యంత్రం ఏర్పాటుకు మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ భూమిపూజ నిర్వహించారు. ఈ యంత్రం అందుబాటులోకి వస్తే తడి, పొడి చెత్తను వేరుచేసి, చెత్త నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడానికి ఈ ఏర్పాటు ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.












