పోతారం వాసి శస్త్రచికిత్సకు రూ.1.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ మంజూరులో చొరవ
ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స చేయించుకోలేక సతమతమవుతున్న నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అండగా నిలిచారు. జనగామ జిల్లా మండలంలోని పోతారం గ్రామానికి చెందిన బూరగొని మల్లయ్య కాలు శస్త్రచికిత్స కోసం రూ.1.50 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఎల్ఓసీ మంజూరయ్యేలా కృషి చేశారు. వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం కొంత ఊరటనివ్వనుంది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిరుపేదలు వైద్యానికి దూరం కాకూడదన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ సహాయం అందేలా తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోతారం గ్రామానికి చెందిన బూరగొని మల్లయ్య కాలు శస్త్రచికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1.50 లక్షల ఎల్ఓసీ మంజూరుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ మంజూరుకు సహకరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్కు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.











