తరిగొప్పుల, 2026-11-26
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుషాపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్, ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి, రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తుచేసుకున్నారు.భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను అందించిందని పేర్కొన్నారు.కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, హక్కులతోపాటు పౌర బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలని అన్నారు.
అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలో పెడుతూ ఐక్యత, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీకాంత్, వార్డు సభ్యులు శివరాత్రి మల్లేష్, జాంజల సంతోష్, తోటి పద్మ మల్లయ్య, మదాసు పద్మ బిక్షపతి, పంగ బిక్షపతి, పోతరబోయిన ఎలేందర్, కోఆప్షన్ సభ్యులు పంగ విజైపాల్, కారోబరి కృష్ణమూర్తి, వాటర్ మ్యాన్ గుండెకారి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.







