కొండపాక్, 2026-11-25
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యాదవ్వ ఎల్లం మాట్లాడుతూ.. గతంలో రైతు బీమా పథకం రైతులకు మాత్రమే పరిమితమై ఉండగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి బీమా రక్షణ కల్పించే దిశగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చందీ కరుణాకర్, పంచాయతీ కార్యదర్శి స్వాతి, వార్డు సభ్యులు బాబు, కిషన్, భవాని, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ ఆరిఫ్, బైరెడ్డి లీల, గంగుల రాజు, తాటిపాముల వెంకటేష్ గౌడ్ తదితర నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.







