మెడ్చల్, 2026-11-20
సూరారం పరిసర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో 24 గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. సీవరేజ్ పైప్లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2026, శనివారం రాత్రి 9 గంటల నుంచి 2026, ఆదివారం రాత్రి 9 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేయనున్నారు.
సూరారం చెరువు నుంచి శివాలయ నగర్లోని 14 ఎంఎల్డీ ఎస్టీపీ వరకు చేపట్టిన 800 ఎంఎం సీవరేజ్ పైప్లైన్ నిర్మాణ పనులు 95 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనుల కోసం తాగునీటి పైప్లైన్ మార్పిడి పనులు చేపట్టనున్నారు. ఈ పనులు సూరారం ప్రధాన రహదారిలో మల్లారెడ్డి ఆసుపత్రి ఎదురుగా 700 ఎంఎం డయా గల తాగునీటి పైప్లైన్ మార్పు పనులను 2026, శనివారం రాత్రి 9 గంటల నుంచి 2026, ఆదివారం రాత్రి 9 గంటల వరకు చేపట్టనున్నారు.
కావున ఈ 24 గంటల పాటు కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగానూ జరిగే అవకాశం ఉంది.
నీటి సరఫరా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. సూరారం వార్డు: విశ్వకర్మ కాలనీ, వైష్ణవి నగర్, వేమారెడ్డి నగర్, లక్ష్మీనగర్, సూరారం గ్రామం. 2. సాయిబాబా నగర్ వార్డు: తెలుగు తల్లి నగర్, జై భీమ్ నగర్, మైత్రి నగర్, సూరారం కాలనీ.
కావున, నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరడమైనది.






