హైదరాబాద్, 11 November
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ () జాతీయ అవార్డును అందుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంత్రి పొన్నం ప్రభాకర్, కమిషనర్ ఆర్వీ కర్ణన్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అవార్డును స్వీకరించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ () జాతీయ అవార్డును అందుకుంది.
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కమిషనర్ ఆర్వీ కర్ణన్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అవార్డును స్వీకరించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కి జాతీయ స్థాయిలో అవార్డు లభించడం హైదరాబాద్ నగరానికి గర్వకారణం.
నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత, ప్రజలకు మెరుగైన పట్టణ సేవలు అందించే దిశగా జరుగుతున్న కృషికి ఈ గుర్తింపు లభించింది.
ఈ అవార్డు నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది.






