దేశవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెన్ను, కెమెరా పట్టుకుని వార్తలు అందించే వారందరూ జర్నలిస్టులేనని, వారిపై కక్షతో పెట్టే అక్రమ కేసులు చెల్లవని స్పష్టం చేసింది. నిజ నిర్ధారణ కేసుల పరిష్కారంలో జర్నలిస్టు సంఘాలకే అధికారం ఉంటుందని తెలిపింది.
పెన్ను పట్టి, వీడియో కెమెరా పట్టి తమ విధుల్లో భాగంగా రోజువారీ వార్తలు, న్యూస్ ప్రసారాలు నిర్వహిస్తున్న వారందరూ జర్నలిస్టులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో జర్నలిస్టులకు కొంత మేర రక్షణ లభించినట్లు అయింది.
ఇకపై కావాలనే కక్షతో రాజకీయ నాయకులు, అక్రమ సంపాదన దందాలు చేసేవారు, వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడేవారి బాగోతాలపై నిజాలను నిర్భయంగా వార్తలు రాసిన, న్యూస్ ప్రసారాలు చేసిన జర్నలిస్టులపై అక్రమ కేసులు చెల్లవని కోర్టు తీర్పునిచ్చింది.
శాటిలైట్ ఛానెల్స్, యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు ఆయా సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉంటే, వారిపై నమోదైన అక్రమ కేసులు లేదా నిజ నిర్ధారణ కేసుల పరిష్కారం కొరకు ఏడు రోజుల్లో నిర్ణయం తీసుకునే హక్కులు జర్నలిస్టుల సంఘాలకే ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది.
జర్నలిస్టుల సంఘాల నిర్ణయాన్ని కాదని అక్రమ కేసులు పెట్టిన వారిపై, అట్టి పోలీసులపై వేటు తప్పదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ తీర్పు జర్నలిస్టుల స్వేచ్ఛకు, వారి భద్రతకు దోహదపడుతుందని భావిస్తున్నారు.












