Jangaon Municipality, Jangaon, Jangaon, Telangana (ఓరుగల్లు న్యూస్) సెప్టెంబర్ 13
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యంపై జనగామ మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించింది. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించి, 163 మంది సిబ్బందికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం 163 మంది మున్సిపల్ సిబ్బందికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన జనగామ మున్సిపాలిటీ.. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సిబ్బందికి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య నమూనాలను సేకరించారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న మొత్తం 183 మంది సిబ్బందిలో 163 మంది వైద్య శిబిరానికి హాజరయ్యారు. హాజరైన సిబ్బందికి సమగ్ర హెల్త్ చెకప్ నిర్వహించడంతో పాటు రక్త నమూనాలు, ఇతర వైద్య పరీక్షలకు సంబంధించిన నమూనాలను వైద్య సిబ్బంది సేకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ చిమ్ముల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు నిరంతరం సేవలందించే పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొనే ఆరోగ్యపరమైన సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ఇటువంటి వైద్య శిబిరాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. అనురాధ జాదవ్, శానిటరీ ఇన్స్పెక్టర్ గోపయ్య, జవాన్లు, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








