మ్యూటేషన్ దరఖాస్తు ఫైల్‌ను ప్రాసెస్ చేసేందుకు రూ.15 వేల లంచం తీసుకుంటుండగా జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి బి. అరుణ, కారోబర్ దాసరి సంతోష్‌ను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన ఒక ఫిర్యాదుదారుడి పేరుపై ఉన్న రెండు ఇళ్ల మ్యూటేషన్ దరఖాస్తు ఫైల్‌ను ముందుకు పంపేందుకు నిందితులు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. తొలుత పంచాయతీ కార్యదర్శి రూ.20 వేలు డిమాండ్ చేయగా, అనంతరం రూ.15 వేలకు ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా మంగళవారం ఉదయం సుమారు 11 గంటలకు జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను వెల్లడించలేదు. ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినా, స్వీకరించినా ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.