ఇప్పలగడ్డ, నర్మట (ఓరుగల్లు న్యూస్) సెప్టెంబర్ 13
ఆటో యూనియన్ సభ్యుడు జోగయ్య(55) అనారోగ్యంతో మృతి. నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు రూపాయలు 20,000 సహాయం.
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం మండలంలోని ఇప్పలగడ్డకు చెందిన ఆటో యూనియన్ సభ్యుడు ఇట్టబోయిన జోగయ్య(55) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. కాగా నర్మట ఆటో యూనియన్ సభ్యులు మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి రూపాయలు 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. పరామర్శించిన వారిలో అధ్యక్షుడు బోయిని లింగం, సభ్యులు సుధాకర్, అంజయ్య, రాజేష్ యాదవ్, బానోత్ భాగ్య నాయక్, తప్పుడు వెంకటయ్య, కందకట్ల గట్టుమల్లు, ప్రజ్ఞాపురం చిరంజీవి, బోయిని నరేష్, తప్పుడు రమేష్ తదితరులు ఉన్నారు.









