జనగామ జిల్లా మండలం అంకుషాపూర్ గ్రామంలో బతుకమ్మ వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. గ్రామ సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్ చొరవతో వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. మహిళలు, గ్రామస్థులు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేలా గ్రామపంచాయతీ పాలకవర్గం చర్యలు తీసుకుంది.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ పాల్గొని ఏర్పాట్లలో సహకరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్థులంతా కలిసికట్టుగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాదాసు పద్మ భిక్షపతి, నాగపురి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.












