మండలంలోని లింగంపల్లి గ్రామ ఉప సర్పంచ్ పరుశారాములు తండ్రి వెంకటాచలం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా యువ నాయకుడు కేశిరెడ్డి రాకేష్‌రెడ్డి మంగళవారం లింగంపల్లి గ్రామానికి వెళ్లి వెంకటాచలం మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా కేశిరెడ్డి రాకేష్‌రెడ్డి మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.












