నర్మెట్ట మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రఘుపతిని, లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్ హెచ్ పీ ఎస్) జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై రఘుపతికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పీ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ రాజు నాయక్, గిరిజన సర్పంచులు మహేందర్ నాయక్, శ్రీను నాయక్, నాయకులు సంతోష్ నాయక్, లకపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.












