గణేష్ నిమజ్జనానికి తరలివెళ్తున్న భక్తులకు హమ్ సాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ఉచితంగా తాగునీటి బాటిళ్లను పంపిణీ చేశారు. ఆర్టీసీ చౌరస్తాలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ యాకూబ్ పాషా నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం మత సామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది. డీసీపీ రాజమహేంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు తాగునీటి బాటిళ్లను అందజేశారు. డీసీపీ మహేంద్ర నాయక్, టౌన్ సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ మీసా జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అంకుష్ షావలి మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా గణేష్ నిమజ్జన భక్తులకు ఉచితంగా తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. మతాలకు అతీతంగా సేవ చేయడం ద్వారా సమాజానికి మత సామరస్యం, సోదరభావం సందేశాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్, మహమ్మద్ సాజిద్, మహమ్మద్ అన్వర్ పాషా, మహమ్మద్ సలీం, 9వ వార్డు కౌన్సిలర్ వెన్నెల రామకృష్ణ, మహమ్మద్ రిజ్వాన్, అమీర్, అజ్జు, ఆజమ్, మహమ్మద్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
గణేష్ నిమజ్జన భక్తులకు ముస్లింల ఆత్మీయ సేవ
Share:

సారాంశం
ఉచితంగా తాగునీటి బాటిళ్లు పంపిణీ చేసిన హమ్ సాత్ ఫౌండేషన్
ముఖ్య విషయాలు
- గణేష్ నిమజ్జనానికి తరలివెళ్తున్న భక్తులకు హమ్ సాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ఉచితంగా తాగునీటి బాటిళ్లను పంపిణీ చేశారు.
- ఆర్టీసీ చౌరస్తాలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ యాకూబ్ పాషా నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం మత సామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది.
- డీసీపీ రాజమహేంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు తాగునీటి బాటిళ్లను అందజేశారు.
- డీసీపీ మహేంద్ర నాయక్, టౌన్ సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
317ఆర్టికల్స్
84,995వ్యూస్










