మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామ మాజీ సర్పంచ్ అర్జుల రమా సంపత్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీడ్ మాజీ డైరెక్టర్ అర్జుల సంపత్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు హాజరై సంపత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షల వెల్లువ
మండల మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు బీరెడ్డి జార్జిరెడ్డి, అక్కరాజుపల్లి మాజీ సర్పంచ్ జొన్నగోని కిష్టయ్య గౌడ్ కలిసి కేక్ కట్ చేసి సంపత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండే సంపత్ రేడ్డిని పలువురు అభినందించారు.
జన్మదిన వేడుకలను సాదాసీదాగా కాకుండా ఆత్మీయతకు ప్రతీకగా నిలిచేలా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం అక్కడికి వచ్చిన నాయకులు, స్నేహితులు, అభిమానులు సంపత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేడుకల ప్రాంగణంలో సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నీలం సంపత్, మూల మహేష్ గౌడ్, మాజీ సొసైటీ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొని అర్జుల సంపత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.












