Bapatla/Korisapadu (ఓరుగల్లు న్యూస్) జూన్ 29
షటవయపతంజుుఐపీఎసఅధులలలోభంవంలపోలీసముషపుచేసతసపీతసుంసైబబదటఫుజయుంటముషర్చేశ.ఆయసథంలో2012బయచచెందుఐపీఎసఅధుుఎ.శవేతవంలొతతసీపీుయముంచ.పసతతంఆమెహైదబదతేంజజయుంటముషవుధలువహుసత.
రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న సన్ ప్రీత్ సింగ్ ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో 2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎన్. శ్వేతను వరంగల్ కొత్త సీపీగా నియమించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఎన్. శ్వేత పదేళ్లలో 9 కీలక పోస్టింగుల్లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆమె బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసి 2012లో యూపీఎస్సీ ద్వారా ఐపీఎస్ కు ఎంపికయ్యారు. కామారెడ్డి ఎస్పీ, సిద్ధిపేట సీపీ, హైదరాబాద్ డీసీపీ, డీడీ విభాగం, జాయింట్ సీపీ (నార్త్ జోన్) వంటి బాధ్యతలు నిర్వహించిన అనంతరం తాజాగా వరంగల్ పోలీస్ కమిషనర్ గా బదిలీ అయ్యారు.











