తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు మండలంలోని గ్రామాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మల చుట్టూ చేరి ఉత్సాహంగా ఆడిపాడారు.
పండుగ వాతావరణం
గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొనగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు. ప్రకృతిని పూజిస్తూ జరుపుకునే పూల పండుగ బతుకమ్మ వేడుకలు గ్రామాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.









