గత ఎనిమిది సంవత్సరాలుగా నిలిచిపోయిన జనగామ డిపో బస్సు సేవలు సోలిపురం గ్రామస్తులకు పునరుద్ధరించబడ్డాయి. పోతారం మీదుగా సోలిపురం వచ్చే బస్సు సౌకర్యం గతంలో ఉండేది కానీ, ఎనిమిదేళ్లుగా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత ఎనిమిది సంవత్సరాలుగా నిలిచిపోయిన జనగామ డిపో బస్సు సేవలు సోలిపురం గ్రామస్తులకు పునరుద్ధరించబడ్డాయి. పోతారం మీదుగా సోలిపురం వచ్చే బస్సు సౌకర్యం గతంలో ఉండేది కానీ, ఎనిమిదేళ్లుగా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను సోమవారం జనగామలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి గ్రామస్తులు విన్నవించారు. వెంటనే స్పందించిన ఆయన ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఫోన్ చేసి, బస్సును వెంటనే నడపాలని ఆదేశించారు. దీంతో అధికారులు స్పందించి, ఈరోజు సోలిపురం బస్సు సేవలను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సోలిపురం గ్రామస్తులు రుణపడి ఉంటామని, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దండెం శ్రీనివాస్, ఉపసర్పంచ్ పెనిమెల్ల రవి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


