యువ హీరో హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన తెల్ల కాగితం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఓరుగల్లు న్యూస్ అందిస్తోంది.

రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. నందు సవిరిగాన కథ, స్క్రీన్ప్లే, మాటలు అందించారు. కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెల్ల కాగితంను రూపొందించారు. హర్ష్ రోషన్, నక్షత్ర పాత్రల మధ్య ప్రేమ, భావోద్వేగాలను టీజర్లో చూపించారు. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.