నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ () 2026 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, స్కోర్‌కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షకు 2.65 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా అభ్యర్థులు ఈ వివరాలను పరిశీలించుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో లాగిన్ అయి ఆన్సర్ కీ, తాము ఎంచుకున్న సమాధానాలు, సరైన సమాధానాలు, ప్రతి ప్రశ్నకు వచ్చిన మార్కులను పరిశీలించుకోవచ్చు. పరీక్షలో సాంకేతికంగా తప్పుగా ఉన్న ప్రశ్నలు ఏవీ గుర్తించబడలేదని తెలిపింది.
2026 మార్కింగ్ విధానం
పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు కేటాయించబడతాయి. తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. సమాధానం ఇవ్వని ప్రశ్నలకు మార్కులు ఉండవు. ఈ విధానం ఆధారంగా అభ్యర్థులు తమ స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు.
స్కోర్‌కార్డు డౌన్లోడ్ ఇలా
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, 2026 విభాగంలోకి వెళ్లాలి. అభ్యర్థి లాగిన్ ఎంచుకుని, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. ఆన్సర్ కీ, రెస్పాన్స్ వివరాలు, స్కోర్‌కార్డును పరిశీలించి, అవసరమైతే డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి.
వ్యక్తిగత స్కోర్‌కార్డులు జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా స్కోర్‌కార్డును భద్రపరచుకోవాలని సూచించింది.










