జనగామ, ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 200 మీటర్ల పరిధిలో గుంపులుగా చేరడం నిషేధించబడింది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా, పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బి.ఎన్.ఎస్. ఎస్ సి. ఆర్. పిసి 163 ప్రకారం ప్రజలు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధించబడింది.
ఈ నిషేధం రేపటి అనగా 10 తారీఖు ఉదయం 6 గంటల నుండి 11 తారీకు రాత్రి 8 గంటల వరకు అమలులో వుంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ తెలిపారు.
ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ప్రజలు ఈ నిషేధాన్ని గౌరవించాలని మరియు ఎన్నికల సమయంలో చట్టాలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.








